ఐపిఎల్ వేలంలో 971 మంది క్రికెటర్లు
ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) - 2020 కోసం అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. వచ్చే ఐపిఎల్ సీజన్ కోసం ఈనెల 19 న కోల్‌కతాలో ఆటగాళ్ల వేలం నిర్వహించనున్నారు. మొత్తం 971 మంది క్రికెటర్లు వేలంలో తమ అదఅష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో 713 మంది భారత ఆటగాళ్లు కాగా.. 258 మంది విదేశీ ప్లేయర్లు. మొత్తం 73 స్థానాల కోసం ఆటగాళ్లు పోటీపడుతున్నారు. 215 మందికి అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. ఈనెల 9 వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ఆన్ని ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను సమర్పించాల్సి ఉంది. ప్లేయర్ రిజిస్ట్రేషన్ నవంబర్ 30 తో ముగిసింది. అత్యధికంగా ఆస్ట్రేలియా నుంచి 55, సౌతాఫ్రికా నుంచి 54 మంది ఆటగాళ్ల వేలంలో పాల్గంటున్నారు. అసోసియేట్ దేశాలు నెదర్లాండ్స్, అమెరికా నుంచి ఒక్కొక్కరు తమ పేరును నమోదు చేసుకున్నారు. క్యాప్‌డ్ ఇండియన్ ప్లేయర్లు 19 మంది కాగా.. అన్‌క్యాప్‌డ్ భారత క్రికెటర్లు 635 మంది ఉండటం విశేషం.