ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు ఆర్బీఐ కొత్త వ్యూహాన్ని అనుసరించనున్నది. రెపో రేటును మార్చలేదు. రెపో రేటు 5.15గానే ఉంచింది. ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకువచ్చేందుకు ఈ ప్రణాళిక అనుసరిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. ద్రవ్యపరపతి కమిటీలోని ఆరుగురు సభ్యులు రెపో రేటు స్థిరీకరణను సమర్థించారు. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 6 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. రివర్స్ రెపో రేటును కూడా ఆర్బీఐ మార్చలేదు. 4.90 శాతం వద్దే రివర్స్ రెపో రేటు యధావిథంగా ఉంటుంది. రెపో రేటులో మార్పు లేని కారణంగా.. అది రియల్ ఎస్టేట్‌కు దోహదం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. 2020-21 బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తొలి మానిటరీ పాలసీ సమీక్ష ఇదే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రెపో రేటు కనీసం అక్టోబర్ వరకు ఇలాగే ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
రెపో రేటులో మార్పులేదు : ఆర్బీఐ