పీఎం కేర్స్ నిధికి తెలంగాణ గవర్నర్ తమిళిసై విరాళం అందించారు. కరోనాపై ప్రభుత్వం చేస్తున్న పోరుకు మద్దతుగా పీఎంకేర్స్ నిధికి ఆమె రూ.5 లక్షల చెక్కు పంపించారు. దేశంలో ఇప్పటికే 4067 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 113 మంది మరణించగా, 306 మంది చికిత్స అనంతరం కోలుకుని వివిధ ఆస్పత్రుల నుంచి డిస్చార్చ్ అయ్యారు. అదేవిధంగా రాష్ట్రంలో 330 కేసులు నమోదవగా, 11 మంది మరణించారు.
పీఎంకేర్స్‌కు గవర్నర్ తమిళిసై రూ.5 లక్షల విరాళం