ఆన్‌లైన్‌లో టీ-సాట్‌ ఛానెళ్ల ప్రసారాలు..విద్యార్థులకు మంత్రి కేటీఆర్ సూచనలు

కరోనా మహమ్మారి నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌  సమయాన్నిపిల్లలు, కళాశాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు.  లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమైన విద్యార్థులు,  వారి తల్లిదండ్రులకు కేటీఆర్  ట్విటర్‌ వేదికగా పలు సూచనలు చేశారు. 


'రాష్ట్ర ప్రభుత్వ  టీ-సాట్ ఛానెళ్ల ద్వారా ఇంటివద్దనే గణితం, స్పోకెన్ ఇంగ్లీష్, మరెన్నో నేర్చుకోవచ్చు. నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు.  టీ-సాట్ విద్య, నిపుణ ఛానెళ్ల  ప్రసారాలు కేబుల్ నెట్వర్క్ ద్వారా, వెబ్‌సైట్‌  http://tsat.tv, లేదా Youtube/tsatnetwork, T-SAT Mobile App లలో అందుబాటులో ఉంటాయి.' అని కేటీఆర్‌ పేర్కొన్నారు.